15 June, 2026 | 6:10 PM

Breaking News

ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •   యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం   •   దత్తతతో చిన్నారుల జీవితాల్లో వెలుగులు   •  

మహేశ్ తర్వాతి చిత్రం గరుడ!

24-08-2024 12:54 AM

‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వర్కింగ్ టైటిల్ ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’. మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయినట్టు స మాచారం. మరోవైపు ఈ చిత్రం కోసం మ హేశ్ బాబు.. లుక్ పరంగా, ఫిట్‌నెస్ పరంగా సిద్ధమయ్యే క్రమంలో గడ్డం, జుట్టు పెంచుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుండగా, ఈ ప్రాజెక్టు టైటిల్‌ను దర్శకుడు రాజమౌళి అనుకోకుండా చెప్పేశాడు.

తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయనను ‘బాహుబలి తర్వాత మీ మైండ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏమిటి’ అని ఓ అభిమాని అడగగానే.. అక్కడి ఫ్యాన్స్ కూడా ముక్తకంఠంగా గరుడ గరుడ... అంటూ అరవటం మొదలుపెట్టారు. దీనికి  రాజమౌళి సమాధానమి స్తూ.. ‘ఔను నా మైండ్‌లో కూడా గరుడ ఉం ది. కానీ, ఇంతకు మించి ఎక్కువ వివరాలు నేనిప్పుడు బయటపెట్టలేను’ అని చెప్పుకొచ్చారాయన. దీంతో అభిమానులంతా ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ టైటిల్ ‘గరుడ’ అన్న నిర్ణయానికి వచ్చేశారు. అయితే, మహే శ్ తాజా కాంబో చిత్రానికి టైటిల్ ఇదేనంటూ అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.