నటి హేమపై సస్పెన్షన్ ఎత్తివేత
24-08-2024 12:44 AM
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) గతంలో సినీనటి హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో తీసుకున్న ఈ నిర్ణయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. కొద్ది రోజుల క్రితం బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ‘మా’ హేమను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.






