25 April, 2026 | 7:58 PM

గణాంకాల సేకరణలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు కీలకం: తహసీల్దార్ శ్రీకాంత్

25-04-2026 06:45 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): గృహ గణాంకాల సేకరణలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు కీలకపాత్ర వహించాలని జన గణన ఇంచార్జీ, తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ తెలిపారు. శనివారం మండల కేంద్రం అర్వపల్లిలోని పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ లో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తొలి విడతలో ప్రతి ఇంటి వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు. అనంతరం సూపర్వైజర్లు,ఎన్యూమరేటర్లతో కలిసి హౌస్ హోల్డింగ్ లిస్టు తయారు చేసే విధానాన్ని పరిశీలించారు.