21 April, 2026 | 7:27 PM

3న బాసర ట్రిపుల్ ఐటీ సీట్ల కేటాయింపు

28-06-2024 12:24 AM

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): ప్రతిష్ఠాత్మక బాసర ట్రిపుల్ ఐటీలో 2024-25 విద్యాసంవత్సరానికి సీట్లను జూలై 3న కేటాయించ నున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో పదో తరగతిలో విద్యార్థులు సాధించిన జీపీఏ ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. ఈ ఏడాది 1,500 సీట్లు భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకర ణ ప్రక్రియ జూన్ 1 నుంచి 22 వరకు చేపట్టారు. స్పెషల్ క్యాటగిరీ విద్యార్థులు డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను సమర్పించేందుకు గడువు జూన్ 29 వరకు ఉండగా, సీట్ల కేటాయింపు జూలై 3న, సర్టిఫికెట్ వెరిఫి కేషన్ జూలై 8న చేపట్టనున్నారు. ఇప్పటివరకు 15 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు బాసర ట్రిపుల్ ఐటీ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు.