హెల్ప్ టూ నీడీ సంస్థల ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు చేయుత
గణపురం,(విజయక్రాంతి): లక్ష్మి అమ్మ ఫౌండేషన్, జెన్‌కో కానిస్టేబుళ్లతో ఏర్పడిన హెల్ప్ టూ నీడీ సంస్థలు సంయుక్తంగా నిత్యావసర సరుకులను అందిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రామంలోని 3 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 వేల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మంకు లక్ష్మి వితంతువు, ఒంటరి మహిళ. ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం, పెన్షన్‌పైనే జీవనం సాగిస్తున్నారు.
సప్పిడి సాంబలక్ష్మి కూలి పనికి వెళ్లిన సమయంలో స్పృహ తప్పి పడిపోవడంతో తలకు తీవ్ర గాయం అయి, ప్రస్తుతం ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కోడెపాక రాజు గతంలో లారీ డ్రైవర్‌గా పనిచేసేవారు. మెదడులో రక్తస్రావం కారణంగా పక్షవాతం రావడంతో చికిత్సకు భారీగా ఖర్చు చేసి ప్రస్తుతం కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ సందర్భంగా సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... నిరుపేదలకు అండగా నిలుస్తున్న లక్ష్మి అమ్మ ఫౌండేషన్ హెల్ప్ టూ నీడీ సంస్థల సేవలను అభినందించారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని కోరారు. అలాగే దాతలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు తమ సి ఎస్ ఆర్ నిధుల ద్వారా ఇటువంటి సేవా సంస్థలకు చేయూతనందించి, మరింత మంది పేదలకు సహాయం అందేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సెగ్గం శ్రీనివాస్, సంస్థ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.






