07-01-2026 01:14:14 AM
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్‌కు ఎంఐఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పాతబస్తీలో రోడ్లు విస్తరించాలి, ఆస్పత్రులు నిర్మించాలి, ఫ్లైఓవర్లు కట్టాలని కో రారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో నియామకాలు పూర్తి చేయాలన్నారు. బాలకార్మికుల నియంత్రణకు కఠిన చర్యలు అమలు చేయాలని అన్నారు.
పాఠశాల విద్యపై మరిం త ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని అక్బరుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో పరిశ్రమల వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దేశంలో బీజేపీ వాషింగ్ మెషీన్‌గా మారిపోయిందని ఓవైసీ విమర్శించారు. ఎంత దోచు కున్నా, ఎన్ని అక్రమాలు చేసినా శిక్ష పడకుం డా ఉండాలంటే ఆ పార్టీ సభ్యత్వం తీసుకుంటే చాలని అన్నారు.