calender_icon.png 12 January, 2026 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విపత్తుల నిర్వహణకు హైడ్రా దిక్సూచి

07-01-2026 01:12:41 AM

  1. ముందస్తు చర్యలతో డిజాస్టర్ ప్రభావాన్ని తగ్గిస్తున్నాం
  2. ఎల్‌బీఎస్‌ఎన్‌ఏలో హైడ్రా కమిషనర్ రంగనాథ్

సికింద్రాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): 1975లో హైదరాబాద్ జనాభా 21 లక్షలుండంగా ప్రస్తుతం 1.3 కోట్లకు చేరిందని, నగర జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని అందరికీ మెరుగైన, పర్యావరణ హితమైన జీవనాన్ని అందించాలనే లక్ష్యం తో తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చింది అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగ నాథ్ చెప్పారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న వేళ.. ప్రజలకు మెరుగైన సేవలు, పాలన అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించడానికి ఉత్తరాఖండ్, ముస్సోరీలోని లాల్బహద్దూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో మున్సిపల్ గవర్నెన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్ పేరిట 5 రోజుల మేధోమథనానికి హైడ్రా కమిషనర్ ప్రత్యేక ఆహ్వాని తులుగా హాజరయ్యారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ లు, ముఖ్య పట్టణాల మున్సిపల్ కమిషనర్లు, ఎన్డీఎంఏ, ఎస్డీఆర్ ఎఫ్ అధికారులు హాజరైన ఈ సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళ వారం ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచ నలనుంచి ఆవిష్కృతమైన ఈ సంస్థ.. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో కొత్తకోణాన్ని ఆవిష్కరిం చిందన్నారు. నగరాల్లో ఉండే చెరువులు, నాలాలను పునరు ద్ధరించి.. ప్రకృతి చికిత్స హైడ్రా చేస్తోందన్నారు. చెరువులతో పాటు వాటిని అనుసంధానం చేసే నాలాలను పరిరక్షించడంతో పాటు పునరుద్ధరిస్తున్నామ న్నారు. ఈ రెండు చర్యలతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు వరద ముప్పును తగ్గించామన్నారు.