07-01-2026 01:14:16 AM
చెత్త పాయింట్ల తొలగింపు
పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు
మణికొండ, జనవరి 6 (విజయక్రాంతి) : నార్సింగి సర్కిల్ 45లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కమిషనర్, డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేర కు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి చెత్త పాయింట్లను శాశ్వతంగా తొలగించారు. నగర సుందరీకరణలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందితో శుభ్రం చేయించారు.ఆయా ప్రాంతాల్లో మళ్లీ చెత్త వేయకుండా అవగాహన కల్పిస్తూ ముగ్గులు వేసి, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఈ ఎస్ డబ్ల్యూ ఎం నరేష్, ఏఈ ఎస్ డబ్ల్యూ ఎం సంతోష్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ లచ్చిరాం పాల్గొన్నారు. శానిటేషన్ జవాన్లు, సిబ్బంది సమన్వయంతో పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. ప్రజలు బహిరంగంగా చెత్త వేయకుండా పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని అధికారులు కోరారు.