calender_icon.png 18 July, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంకర్‌పల్లి అభివృద్ధికి సహకారం

18-07-2025 12:35:22 AM

ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి 

చేవెళ్ల , జులై 17: హైదరాబాద్ కు సమీపంలో ఉన్న శంకర్ పల్లి అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. గు రువారం మండలంలోని దొంతాన్ పల్లి లోఎమ్మెల్యే యాదయ్య తో కలిసి వన మహోత్సవం లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ . 10 లక్షలతో నిర్మించనున్న యూత్ బిల్డింగ్ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంకర్ పల్లి మండలంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎన్ని నిధులై నా తీసుకొస్తామని మాటిచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరి సహకారంతో చేవెళ్ల నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గోపురారం మాజీ సర్పంచ్ పొడువు శ్రీనివాస్, ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.