18-07-2025 12:38:41 AM
ఆహ్వానించిన మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి , జూలై 17: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ 3వ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్, బిజెపి పార్టీ లకు చెందిన నాయకులు మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ,3వ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కోనేటి వెంకట్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా సుమారు 20 మంది నాయకులకు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాయిప్రియ నగర్ కాలనీ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అమర్ పటేల్ తో పాటు నాగరాజు రావు, ప్రశాంత్, మహేష్, ఆంజనేయులు పటేల్, సంతోష్, లక్ష్మారెడ్డి, అబ్దుల్, భాస్కర్, శంకర్, అశోక్, రవికాంత్, సునీల్, రామిరెడ్డి, గౌస్ భాయ్, కిషోర్, టింకు, శామ్యూల్, జోసెఫ్, రవితో పాటు తదితరులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మల, యూత్ అధ్యక్షుడు పైళ్ల ప్రభాకర్ రెడ్డి, యసారం శ్రీనివాస్, పింగళి జోగిరెడ్డి, కిరణ్ నాయక్, వరికల శ్రీనివాస్, లగ్గాని సోమేశ్ గౌడ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు, పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.