03-12-2025 12:58:40 AM
మండల స్థాయిలో వికలాంగులకు న్యాయం చేయండి
ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి
నడవలేని స్థితిలో ఉన్నవారికి ప్రభుత్వ ఆదరణ అవసరం
మండల దివ్యాంగుల సంఘం అధ్యక్షులు రేగళ్ల సుధాకర్
చర్ల,డిసెంబర్ 2 (విజయక్రాంతి): ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా చర్ల మండలం లోని వికలాంగుల సమస్యలపై గళం విప్పారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో వికలాంగుల హక్కులు, గౌరవం, శ్రేయస్సు గురించి అవగాహన కల్పించడం, వారిని సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవితంలో పూర్తిగా భాగస్వాములను చేయడం.
ఈ దినోత్సవాన్ని 1992లో ఐక్యరాజ్యసమితి ప్రారంభించిందని. జిల్లాస్థాయిలో వికలాంగుల సంక్షేమ పథకాలు మారుమూల గ్రామాల్లో ఉన్న వారికి అందడం లేదఅంటూ చర్ల మండలం లో వికలాంగులు వాపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2023 సార్వత్రిక ఎన్నికలలో ప్రతి వికలాంగులకు 35 కేజీల బియ్యం ఇస్తామని ప్రకటించారు కానీ అది ఇప్పటికీ నెరవేరలేదని ,అర్హులైన వికలాంగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తామని నేటికీ ఉద్యోగ కల్పన జరగడంలేదని, సుమారు చర్ల మండలంలో 500 మందికి పైగా వికలాంగులు ఉన్నారని వారిలో నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇప్పటికి కూడా కొందరికి సదరం సర్టిఫికెట్లు రాకపోవటం శోచనీయమన్నారు.
వికలాంగులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లో జాప్యం జరుగుతుందని, ప్రభుత్వం నుంచి అందవలసిన త్రీ వీలర్ సైకిల్, వికలాంగుల వాహనాలు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో మండలానికి ఒకరికి మాత్రమే ఇచ్చే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండలానికి సుమారు 25 కు పైగా సైకిల్ గాని వాహనాలు గాని అందిస్తున్నారని అయితే ప్రభుత్వ పథకాలు.
సక్రమంగా అందాలంటే జిల్లా నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వికలాంగులను ఆలోచించాలని వారి భవిష్యత్ కొరకు మార్గదర్శకాలను సూచించే విధంగా ఉన్నతఅధికారులకు తెలియజేసి వికలాంగుల జీవితాలలో వెలుగులు పంచేల ఆలోచన చేయాలని చర్ల మండలంలోని వికలాంగుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న రేగళ్ల సుధాకర్ ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని వికలాంగుల సమస్యలను మండల అధికారులు తక్షణమే నెరవేర్చే విధంగా సహకరించాలని ఈ సందర్భంగా మాట్లాడారు.