03-12-2025 12:59:34 AM
ప్రారంభించిన నటి సన్నీలియోన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 2 (విజయక్రాంతి): నగరంలోని మాదాపూర్, హైటెక్ సిటీ ప్రధాన రోడ్డు వైపు మెట్రో పిల్లర్ నంబర్ 1743 వద్ద ఏర్పాటు చేసిన హియ్యా క్రోనో జైలు మండిని బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మంగళవారం ప్రారంభించారు. ఇది ఆసియాలోనే ప్రప్రథమ థియేట్రికల్ డైనింగ్ స్పేస్ అయిన మండి రెస్టారెంట్.
అతిథులకు ప్రత్యేకమైన, వినూ త్న శైలి జైలు నేపథ్య వాతావరణాన్ని అందిస్తుంది. ఈ సందర్భంగా సన్నీలియోన్ మాట్లాడుతూ.. ‘హి య్యాలోని రుచికరమైన ఆహారం ఉత్సాహభరితమైన థీమ్తో నిజంగా చాలా ఆకట్టుకుంది. నేను ఇప్పటివరకు రుచిచూసిన అత్యంత రుచికరమైన మండి వంటకాలు ఇవే. నాకు ఈ సిటీ అంటే ఇష్టం.
వీలైనప్పుడల్లా హైదరాబాద్‌కు రావడానికి ఇష్టపడ తాను’ అని ఆమె అన్నారు. హియ్యా క్రోనో జైలు మండీ రెస్టారెంట్ ఫౌండర్ గౌతమి చౌదరి మాట్లాడు తూ.. తమ హి య్యా ఉత్తమ నేపథ్య అనుభవాన్ని మధ్యతరగతికి తీసుకువస్తుందని, నగరంలోని అత్యంత ఆసక్తికరమై న తాజా ఇన్‌స్ట్రాగామ్బుల్ స్పాట్గా మారనుందని అన్నారు. తమ బ్రాండ్ ఫ్రాంచైజీలను కూడా అందిస్తోందని, ఆసక్తి ఉన్న వారు వివరాల కోసం 9126966666 నంబరులో సంప్రదించవచ్చని సూచించారు.