calender_icon.png 3 December, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులే దేశ అభివృద్ధికి ఆధారం

03-12-2025 12:58:18 AM

-సైబర్ ఫోరెన్సిక్స్ డైరెక్టర్ రామ్మోహన్

-‘భారతీయ జ్ఞాన పరంపర’ సంగమ వేడుకలు

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ది క్రీక్ ప్లానెట్ స్కూల్ వీనస్ క్యాం పస్‌లో పీపీ నుంచి 5వ గ్రేడ్ వరకు విద్యార్థుల కోసం నిర్వహించిన సంగమ 2025 సాంస్కృతిక వేడుకలు చిన్నారుల ఉత్సాహంతో కొనసాగాయి. ఈ ఏడాది థీమ్ భారతీయ జ్ఞాన పరంపర విజయ విజేతల పటము, దశాబ్దం పాటు ఉన్నత పాఠశాల పదేళ్ల ప్రయాణం, సంస్కృతి, అభ్యాసం, సమగ్ర అభివృద్ధిని ప్రతిబింబించింది.

ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎస్పీ, సైబర్ ఫోరెన్సిక్స్ డైరెక్టర్ యు రామ్మోహన్ మాట్లాడుతూ.. జ్ఞానం, విలువలతో ఎదిగే విద్యార్థులే దేశ అభివృద్ధికి ఆధారం అన్నా రు. కాగా దీపప్రజ్వలన అనంతరం జరిగిన ఆహ్వాన నృత్యం అజ్ఞానం నుండి జ్ఞానప్రకాశం వైపు దారితీసే భారతీయ సంప్రదా యాన్ని అందంగా ప్రతిబింబించింది.

చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు మంత్రము గ్ధులను చేశాయి. వార్షిక నివేదిక 2024ను ప్రిన్సిపాల్ కె. డమారిస్ సమర్పించారు. ఇందులో విద్యా పురోగతి, విద్యార్థుల విజయాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి ముఖ్య అంశాలను వివరించారు. అకడమిక్ హెడ్ డాక్టర్ జయశ్రీ నాయర్, చైర్మన్ బోల్లినేని సీనయ్య, వైస్ చైర్మన్ పండు రంగ చారి మాట్లాడారు. అకడమిక్ అడ్వైజర్, బోర్డ్ మెంబర్ ప్రతిమ సింహా విద్య ప్రాముఖ్యత, భవిష్యత్ నైపుణ్యాలపై మాట్లాడారు.