21 June, 2026 | 1:38 AM

ముదిరాజ్ ఉద్యమానికి మద్దతు ఇవ్వండి:డాక్టర్ భట్టు విటల్

21-06-2026 12:00 AM

ముదిరాజ్ హక్కుల కోసం తప్పక మద్దతు ఎమ్మెల్సీ ఆర్ కృష్ణయ్య హామీ

మేడ్చల్ అర్బన్ జూన్ 20(విజయక్రాంతి):గత కొన్ని దశాబ్దాలుగా రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న సాగుతున్న ముదురాజ్ జాతి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ&బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యను కోరినట్లు టీఎంజీఇఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ తెలిపారు.ఈ నేపథ్యంలో బిసి A హామీని వెంటనే అమలు చేసేలా సాగుతున్న ముదిరాజ్ జాతి ఉద్యమానికి మద్దతుగా నిలబడతానని ఎమ్మెల్సీ ఆర్ కృష్ణయ్య హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా బీసీల మధ్య వివక్షత లేకుండా శాశ్వతమైన పరిష్కారం చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కృష్ణయ్య తెలిపినట్లు డాక్టర్ బట్టు విఠల్ తెలిపారు.ముదిరాజ్ జాతిపై రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందని తెలంగాణ ముదిరాజ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భట్టు విఠల్ ముదిరాజ్ ఆరోపించారు.గతంలో నూటికాడి అన్నం ముద్దను తన్నుక పోయినట్లు జీవో ఎంఎస్ నంబర్ 15ను ఇచ్చి యువతను నిలువునా మోసం చేసి 2023 ఎమ్మె ల్యే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అమలు చేసేలా సాగుతున్న ముదిరాజ్ జాతి ఉద్యమానికి అనుకూలంగా బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇవ్వాలని కోరినట్లు ఆయన స్పష్టం చేశారు.

రాజ్యాంగబద్ధమైన హక్కులను కల్పించాలని బిసిఏ జీవో ఎంఎస్ నంబర్ 15ను అమల్లోకి తీసుకురావాలని ముదిరాజ్ యువత నిరుద్యోగులు మహిళల భవిష్యత్ తరాల హక్కుల సాధన కోసం సాగుతున్న ముదిరాజ్ జాతి ఉద్యమంతో కలిసికట్టుగా నడవాలని ప్రత్యేక హోదా నైన కల్పించాలని భట్టు విఠల్ డిమాండ్ చేశారు.రాజకీయ నాయకుల కుట్రలతో తమ జాతికి సామాజిక న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన బిసి A హామీని వెంటనే అమలు చేసేలా ఒత్తిడి తెస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నాయకులు విటల్ ముదిరాజ్ తెలియజేశారు.కామారెడ్డి లో జరిగే బీసీ డిక్లేరేషన్ హామీ సమావేశానికి రావాలని కోరినట్లు ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రాజేందర్ ముదిరాజ్.ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటేష్ ముదిరాజ్.పిహెచ్‌ఈడి సంఘం అధ్యక్షులు సంతోష్ కుమార్ ముదిరాజ్.బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి వెంకటయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.