21 June, 2026 | 1:40 AM

జయశంకర్ సర్ త్యాగాన్ని మరువం

21-06-2026 12:00 AM
  1. ఆ మహనీయుడి స్ఫూర్తిని కొనసాగిస్తాం
  2. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయన ఆశయాలను, ఉద్యమస్ఫూర్తిని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. తెలంగాణ జాతిపిత, స్వరాష్ట్ర స్వాప్నికులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడిని సీఎం రేవంత్‌రెడ్డి స్మరించు కున్నారు.

ప్రత్యేక రాష్ట్ర సాధనే తన ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసంగా తుదిశ్వాస వరకు గడిపిన గొప్ప వ్యక్తి జయశంకర్ సర్ అని గుర్తు చేశారు. ఆ మహనీయుడి త్యాగాన్ని తెలంగా ణ సమాజం మరవదని, ఆయన ఆశయ సాధనకోసం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్దాల పాటు సజీ వంగా ఉండటానికి, రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడాన్ని జయశంకర్ సార్ వ్యతిరేకించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు.