28 July, 2026 | 1:04 PM

Breaking News

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు   •  

ప్రత్యర్థి శత్రువు కాదు

28-05-2024 12:05 AM

సుప్రీంకోర్టు 

బీజేపీ పిటిషన్ కొట్టివేత

న్యూఢిల్లీ, మే 27: ప్రత్యర్థి శత్రువు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనల ప్రచురణపై కోల్‌కతా హైకోర్టు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రత్యర్థులను శత్రువులుగా భావించవద్దని హితవు పలికింది. బీజేపీ ప్రకటనలు తాము చూశామని, అవి అభ్యంతరకరంగా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.