కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు
13-06-2024 12:14 PM
న్యూఢిల్లీ: కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో విద్యుత్ లేకుండా ఏ పనీ కాదని కిషన్ రెడ్డి అన్నారు. మోడీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. విద్యుత్ కోతలు లేకుండా ఉండాలంటే బొగ్గు ఉత్పత్తి పెంచాలని చెప్పారు. మనం ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామని స్పష్టం చేశారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.






