15 June, 2026 | 7:22 PM

Breaking News

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •  

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న సుప్రియ శ్రీనివాస్‌గౌడ్

06-02-2026 12:49 AM

మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డు (ఎల్లంపేట్) లో బిజెపి అభ్యర్థి గౌరయ్య గారి సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికి తిరిగి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరుతున్నారు.

సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ప్రచారానికి అనూహ్యస్పందన లభిస్తోంది. వార్డు పరిధిలో యువకులు, మహిళలు, కుల సంఘాల మద్దతు కూడగట్టారు. సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ప్రజల్లోనే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాల్గొనడం కలిసి వస్తోంది. శ్రీనివాస్ గౌడ్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్ మేనల్లుడు. శ్రీనివాస్ గౌడ్ భార్య సుప్రియ కౌన్సిలర్ పదవికి పోటీ చేస్తున్నారు. 

వార్డు అభివృద్ధికి కృషి చేస్తా: సుప్రియ శ్రీనివాస్ గౌడ్ 

ఎల్లంపేటలోని పదవ వార్డు కౌన్సిలర్ గా గెలిపిస్తే అభివృద్ధికి శా యశక్తుల కృషి చేస్తానని సుప్రియ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మున్సిపాలిటీ నిధులతో రోడ్లు, నువ్వు కాలువలు నిర్మిస్తానన్నారు. మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. తనను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.