calender_icon.png 14 November, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ గా సురేష్ బాబు తోటమల్ల నియామకం

14-11-2025 10:02:37 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ కవి, కవిరత్న సురేష్ బాబు తోటమల్ల ను శ్రీశ్రీ కళావేదిక తెలంగాణా రాష్ట్ర కో ఆర్డినేటర్ గా నియమిస్తూ శుక్రవారం శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సీఈఓ డా.కత్తిమండ ప్రతాప్, జాతీయ ఆధ్యక్షురాలు ఈశ్వరీ భూషణంలు నియా మకపు ఉత్తర్వులు విడుదల చేశారు. ఐఎస్ఓ (ISO)గుర్తింపు కలిగిన తొలి సాహితీ సంస్థ, 36 ప్రపంచ రికార్డులు సృష్టించి ప్రపంచం లోనే అతి పెద్ద సాహితీ సంస్థకు రాష్ట్ర కో ఆర్డినేటర్ గా సురేష్ బాబు నియామకం పట్ల హర్షాతి రేఖాలు వ్యక్తం అవుతున్నావి.

చర్ల మండలంలోని తేగడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తేగడలో పిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సురేష్ బాబు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, బెస్టు ఎం.ఎల్.ఓ, బెస్టు డిఆర్పి, బెస్టు ఎంహెచ్ఓ ఆవార్డులతో పాటు కవిత్వంలో పలు జాతీయ, అంతర్జాతీయ పురష్కరాలు అందుకున్నారు. మోటివేషనల్ స్పీకరుగా ఎందరో యువకుల జీవితాలలో వెలుగులు నింపారు. నటుడిగా పలు సందేశాత్మక షార్ట్ ఫిల్మ్స్, సినిమాలలో మంచి పేరు సంపాదించారు. ఇటీవల అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయు రాష్ట్ర కార్యదర్శిగా భాధ్యతలు చేపట్టారు. శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా సురేష్ బాబు ఎంపికపట్ల పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు ధనికొండ శ్రీనివాసరావు కె .వి రమణ, బి .కృష్ణ  లు హర్షం తెలిపారు .