calender_icon.png 14 November, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంకన్ డ్రైవ్ పట్టుబడిన 57 మందికి జరిమానాలు

14-11-2025 09:51:39 PM

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష, జరిమానా తప్పదు,తస్మాత్ జాగ్రత్త.

సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ.

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 57 మంది మందు బాబులు పట్టుబడగా వారిని సిరిసిల్ల పట్టణ పోలీసులు శుక్రవారం రోజున  కోర్టులో ప్రవేశపెట్టగా 57 మంది మందు బాబులకు జరిమానాలు విధిస్తు మేజిస్ట్రేట్ జయశ్రీ తీర్పు వెల్లడించినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.

1.02 కి ఒక్కొక్కరికి 6000/- రూపాయలు జరిమానా.

2.12 మందికి ఒక్కోక్కరికి 5000/- రూపాయల జరిమాన..

3. ఒక్కరికి 4000/- రూపాయల జరిమన..

4.42 మందికి ఒక్కొక్కరికి 1000 రూపాయల జరిమానా.

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లోపట్టుబడిన మందు బాబులకు పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, ట్రాఫిక్ ఎస్.ఐ దిలీప్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారితో ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా సి.ఐ  మాట్లాడుతూ.ప్రతి రోజు పట్టణ ప్పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహించాడం జరిగుతుందని, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతు పట్టుబడిన వారికి తల్లితండ్రుల, లేదా కుటుంబ పెద్దల సమక్షంలో కౌన్సెల్లింగ్ ఇవ్వడం జరిగుతుందని అన్నారు.మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశలకు పోలీస్ వెరైఫికేషన్ సమయంలో ఇబ్బందులు కలుగుతయని,ట్రాఫిక్, రోడ్ భద్రత నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.