calender_icon.png 14 November, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన

14-11-2025 10:04:56 PM

బోథ్,(విజయక్రాంతి): బాల్య వివాహ ముక్తుభారత్ 30 రోజుల క్యాంపెయిన్ లో భాగంగా బాల్య వివాహ రహిత తెలంగాణ రాష్ట్రం నిర్మించాలని శుక్రవారం బోథ్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కేజిబివి, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా మిషన్ శక్తి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిల్లలకు బాల్యవివాహాల వలన కలిగే అనర్థాల పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా 7 8 9 10 తరగతి పిల్లలతో కిషోరీ కమిటీలు ఏర్పాటు చేశారు. జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లోని బాలికలందరికి, వారి తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై చైల్డ్ హెల్ప్ లైన్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ మాట్లాడుతూ బాల్య వివాల వల్ల జరిగే అనర్థాలను వివరించి పిల్లలకి ఏ విధమైన సహాయం కావాలన్నా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ను సంప్రదించాలని తెలిపారు. బాల్య వివాహాలకు సంబంధించి సమాచారాన్ని 1098 నెంబర్ కి తెలియజేయాలని తెలియజేసిన వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచబడతాయని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా డి.హెచ్.ఈ. డబ్లూ ఆర్థిక అక్షరాస్యత నిపుణుడు నిఖిలేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బేటి బచావో బేటి పడావో లో భాగంగా ఆడపిల్లల సంరక్షణ గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.