రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు 62 బెంచీలు, డెస్కులు పంపిణీ
కామారెడ్డి, జూన్ 24 (విజయక్రాంతి):కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఏర్పాటుచేసిన కె ఆర్ ట్రస్ట్ ద్వారా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో గల ఎంపీపీ ఎస్ పాఠశాలకు బుధవారం బెంచీలతో పాటు డెస్కులు పంపిణీ చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దిటి మోహన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా పేద విద్యార్థుల కొరకు బెంచీలు డెస్క్లు మా పాఠశాలకు పంపినందుకు ఎమ్మెల్యే కె.వి.ఆర్ కు పాఠశాల తరఫున గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కేపీ.రాజారెడ్డి జనసేవ ట్రస్ట్ ద్వారా 5 తరగతులకు డెస్క్ లు (62)బెంచి లు పంపించినట్లు తెలిపారు.అక్కాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీటి. మోహన్, సహా ఉపాధ్యాయులు మోహన్, శ్రీనివాస్, కీర్తన, రజిత. ట్రస్ట్ సభ్యులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.






