18 March, 2026 | 8:28 PM

సర్వే డబ్బులు చెల్లించాలి

18-03-2026 05:12 PM

కడెం,(విజయక్రాంతి): సర్వే డబ్బులు చెల్లించాలి గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే 2024 డిసెంబర్లో జరిగిన సర్వేకు సంబంధించిన పారితోషికం ఎప్పటి వరకు చెల్లించలేదని వెంటనే చెల్లించాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

33 జిల్లాల్లోని అన్ని జిల్లాల్లో చెల్లించారు. ఒక నిర్మల్ జిల్లాకే ఇంతవరకు ఏడాది ఒక సంవత్సరం గడిచిన కూడా డబ్బులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము కలెక్టర్ గారి చెరువుతో వెంటనే డబ్బులు చెల్లించాలని లేకుంటే వచ్చే జనగణనను బహిష్కరించే ఆలోచనలో ఉన్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, జిల్లా నాయకులు లక్ష్మీ నరసయ్య, నాయకులు శ్రీనివాస్, ఎందరు నేత సుద్దాల రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.