18 March, 2026 | 8:31 PM

గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్మోహన్రావు

18-03-2026 05:08 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోలిలింగాల గ్రామంలో గ్రామ సర్పంచ్ బుర్రకాయల రోజా బాబు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్ ఆదాయ వ్యాయాల గురించి గ్రామస్తుల ముందు చదివి వినిపించడం జరిగింది. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక గురించి గ్రామసభలో చర్చించడం జరిగింది. గ్రామ అభివృద్ధి పనుల కొరకు 10 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు.

10 లక్షల నిధులతో గ్రామంలో సిసి రోడ్డులు, వివోఏ బిల్డింగ్ మరియు వివిధ అభివృద్ధి పనులు నిర్వహించడం జరుగుతుందని గ్రామసభలో తీర్మానం చేయడం జరిగింది. గ్రామ అభివృద్ధి కొరకు పది లక్షల నిధులు మంజూరు చేసినందుకు గ్రామ ప్రజల తరఫున గ్రామ సర్పంచ్ బుర్రకాయల రోజా బాబు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి బుర్రకాయల రోజా బాబు, ఉపసర్పంచ్ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.