17 April, 2026 | 3:05 PM

లక్ష్మీనర్సింహా స్వామికి సూర్యప్రభ వాహనం అందజేత

30-12-2025 12:50 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),డిసెంబర్29: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహా స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి,అమ్మవార్లను ఊరేగించేందుకు ఉపయోగించే సూర్యప్రభ వాహనాన్ని దాతలు ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి కి అందజేశారు. వివరాల్లోకి వెళితే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన కీ.శే. తుక్కాని రాధమ్మ,కీ.శే. తుక్కాని వీరారెడ్డి, మిర్యాల గూడకు చెందిన కీ.శే. యారాల నారాయణరెడ్డి గార్ల జ్ఞాపకార్థం యారాల ప్రమీల వారి కుటుంబ సభ్యులు రూ.2లక్షల10వేలు విలువ చేసే సూర్యప్రభ వాహనాన్ని సోమవారం ఆలయంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో యారాల నర్సిరెడ్డి,ప్రభాకర్ రెడ్డి,జయకర్ రెడ్డి,దయాకర్ రెడ్డి,అయ్యాళపు ఉమామహేశ్వరరెడ్డి,నిరంజని,అర్చకులు తదితరులు పాల్గొన్నారు.