ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం
చిట్యాల, డిసెంబర్ 29(విజయ క్రాంతి): చిట్యాల పట్టణంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాటి దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో లారీల ఓనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో ప్రస్తావించి సమస్యలను పరిష్కరించాలని కోరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని గతంలో ఆరు సంవత్సరాలు దాటిన లారీల రెన్యువల్ 1000 ఉండేదని దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెంచుకుంటూ నేడు లారీల ఫిట్ నెస్ ల ఛార్జీ 30వేలు చేసిందని ఇది సామాన్య లారీ ఓనర్ లకు భారంగా మారుతుందని అన్నారు.
ప్రభుత్వం కల్పించుకొని లారీల ఫిట్నెస్ చార్జీల విషయంలో వెసులుబాటు కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పోలగోని వెంకన్న, ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి గణేష్, కోశాధికారి జంగయ్య, జాయింట్ సెక్రెటరీ మందడి భగవాన్ రెడ్డి, ఎండి అన్వర్, కార్యనిర్వాక కార్యదర్శి రావుల చినమల్లారెడ్డి, లారీల ఓనర్లు ఎస్.కె అక్రమ్, మల్లారెడ్డి, మల్లేష్, మాధవరెడ్డి పాల్గొన్నారు.




