27 June, 2026 | 5:00 PM

ముస్సోరీలో ముగించారు

21-06-2025 02:19 AM

చిరంజీవి 157వ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగాస్టార్ సరసన కథానాయికగా నయనతార నటిస్తుండగా.. వీటీవీ గణేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో చిరంజీవి తన అసలు పేరైన శివశంకర్ ప్రసాద్‌గా కనిపించనున్నారు. షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

తాజాగా మేకర్స్ ముస్సోరీ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతారపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు ‘మెగా157’గా ప్రచారంలో ఉంది. ఈ సినిమా సంక్రాంతి కానుగా 2026 జనవరిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవో పీ: సమీర్‌రెడ్డి; ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్; ఎడిటర్: తమ్మిరాజు.