వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్..
తూప్రాన్,(విజయ క్రాంతి): తూప్రాన్ పట్టణంలో వరుస చోరీలకు పాల్పడిన నిందితుడిని తూప్రాన్ పోలీసులు 24 గంటల వ్యవధిలో పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా సిఐ వెంకట రాజగౌడ్ మీడియాతో మాట్లాడుతూ నిందితుడు మామిడి శ్రీకాంత్ 31 సూర్యాపేట, గత మూడు రోజులుగా తూప్రాన్, మసాయిపేట్ ప్రాంతాలలో గ్యాస్ సిలిండర్లు, బైక్ లు, ఇంకా వగైరా చిన్న చిన్నా చోరీలు చేస్తూ అలజడి సృష్టించాడు.
మంగళవారం తూప్రాన్ ప్రాంతంలో బైక్ పైన గ్యాస్ సిలిండర్లు దొంగతనం చేసి తీసుకెళ్తుండగా పోలీసుల కంట పడ్డాడు తక్షణమే తూప్రాన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి గతం లోనూ నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించామని సిఐ వెంకటరాజు గౌడ్ ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఇందులో ఎస్ఐ గంగారాజు, కానిస్టేబుల్ లు కృష్ణ, గోవర్ధన్, సురేష్, రాజు, మహేష్ గౌడ్ లు ఉన్నారు.






