2 September, 2026 | 12:05 AM

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బిఆర్ఎస్ సమరభేరి

01-09-2026 | 11:29pm

అమలు కాని 6 గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయండి 

గుగులోతు కృష్ణ నాయక్

గరిడేపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై బి ఆర్ ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సమరభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్ కోరారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గం సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, నియోజకవర్గ నాయకులు పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సమరభేరి కార్యక్రమాన్ని మండలంలోని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 1000 రోజుల వైఫల్య పాలనపై, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అవుతున్న ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలు నమ్మి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నట్టేట ముంచిందని ఆరోపించారు. అబద్ధాలు, వంచన్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు ఈనెల రెండవ తేదీ నుంచి 8వ తేదీ వరకు అన్ని గ్రామాలలో కార్యాచరణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.