02-02-2026 12:33:17 AM
రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చాలంటూ ఆ ప్రాంతవాసుల వేడుకోలు
జడ్చర్ల, ఫిబ్రవరి 1 : జడ్చర్ల మున్సిపాలిటీలో పలు ప్రాంతాలలో రోడ్లు గుంతల మాయంగా మారాయి. పట్టణంలోని 7 వార్డ్ బురెడ్డిపల్లిలో రోడ్ల పరిస్థితి మరి దారుణంగా తయారయింది. బాదేపల్లి నుంచి బురెడ్డిపల్లి మీదుగా ఎన్ హెచ్ -47 వెళ్లే ప్రధాన రహదారి గోతులమయంగా తయారయింది. వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారింది. రోడ్డు మీద గుంతలు చాలా లోతుగా ఉండటంతో నీటితో నిండిపోయి చాలా అద్వా నంగా తయారయ్యాయి.
బాదేపల్లి నుంచి హైవే కి వెళ్లే దారి కాబట్ట రాత్రి సమయంలో వాహనదారులు ద్విచక్ర వాహనాలు పెద్ద వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోగుంతలు మరి ఎక్కువగా తయారయ్యా యి. మున్సిపాలిటి లో కలిసిన బురెడ్డిపల్లి గ్రామం గ్రామపంచాయతీలో ఉన్న ప్రధాన రోడ్డు ను మాత్రం మరమ్మత చేయడంలో అధికారులు విఫలమవుతూనే వస్తున్నారని ఆ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. ఇప్పుడైనా పాలకులు బురెడ్డిపల్లి గ్రామం పై దృష్టి సారించి రోడ్ల పరిస్థితిని మెరుగుపరచాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.