జగిత్యాల, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ అ ధికారి అరుణ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉన్నతాధికారు లు ఉత్తరులు జారీ చేశారు. మరి కొందరు అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధం చే సినట్లు తెలిసింది. ఈ నెల 11న జగిత్యాల అటవీ శాఖ కార్యాలయంలో నిరహించిన దావత్‌లో మద్యం సే వించిన అధికారులతో పాటు సిబ్బ ంది పాల్గొన్నారు.
ఇందుకు ప్రధాన బాధ్యుడైన రేంజ్ అధికారి అరుణ్‌కుమార్‌పై చర్యలు తీసుకుంటూ బాసర సీసీఎఫ్ శరవణన్ సస్పెన న్ ఉత్తరులు జారీ చేశారు. కొడిమాల రేంజ్‌లో పనిచేస్తున్న సాయి రామ్ అనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌పై రెండో సస్పెనన్ వేటు వేశారు. ని ర్మల్ జిల్లా నుంచి కూడా కొందరు ఉద్యోగులు పాల్గొనడంపై ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తు న్నారు. దావత్‌లో పాల్గొన్న టింబ ర్ డిపో సామిల్ అసోసియేషన్ సభ్యుల పేర్లు కూడా విచారణలో ఉండటం గమనారం.