అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్
16-03-2026 08:11 PM
కోనరావుపేట(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన జోగు తరుణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర చికిత్స అవసరమైన విషయం తెలిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తక్షణమే స్పందించారు.
నిమ్స్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి తరుణ్‌కు ప్రత్యేక వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుండి వైద్య ఖర్చుల కోసం రూ.4,50,000 విలువ గల ఎల్‌ఓసీను వెంటనే మంజూరు చేయించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం అందడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.




