16 March, 2026 | 9:14 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పన

16-03-2026 08:06 PM

కుభీర్,(విజయక్రాంతి): బైంసా పట్టణంలోని జిపిఎల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు, సింగిల్ యూసేజి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ శాస్త్రవేత్త  బి. తిరుపతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడటం వల్ల ప్రజల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, సింగిల్ యూసేజి ప్లాస్టిక్ నిషేధం లో ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ మార్గాలను ఆయన విద్యార్థులకు వివరించారు. సి.పి.సి.బి (CPCB) రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన బయో-డిగ్రేడబుల్ (జీవ విచ్ఛిన్నం చెందే) సంచుల వివరాలను విద్యార్థులకు వివరించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.