19 July, 2026 | 2:42 AM

తహసీల్దార్, జీపీఓ సస్పెన్షన్

19-07-2026 12:30 AM

దమ్మపేట, జులై 18 (విజయక్రాంతి): భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో  అక్రమ వారసత్వ పట్టామార్పిడిలో దమ్మపేట తహసీల్దార్ కె. రాం నరేష్, పెద్దగొల్లగూడెం  పరిపాలన అధికారి వలవల అనంతమ్మను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.

దమ్మపేట మండల పరిధిలోని ఏజెన్సీ ఏరియాలో గల పెద్దగొల్లగూడెం రెవెన్యూ సర్వే నెంబరు 385/54లో మళ్ళాసత్యం పేరుతో వున్న ఐదెకరాల ఎసైన్మెంట్ భూమిని పట్టాదా రు మళ్ళా సత్యం బతికి ఉండగానే నకిలీ మరణ ధృవపత్రం, నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృషించారు. అనంతరం పట్టాదారు మ ళ్ళా సత్యానికి ఎటువంటి బంధుత్వం లేని నామ పుష్పవతి భర్త సత్య నారాయణ పేరుతో పట్టా మార్పిడి చేశారు. కలెక్టర్  ఆదేశాల మేరకు  జీపీఓ, తహసీల్దార్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.