14-12-2025 09:22:41 AM
హైదరాబాద్: మహబూబాబాద్(Mahabubabad) మండలం కొమ్ముగూడెంలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత(Married Woman) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని స్వప్నగా గుర్తించారు. కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపించారు. అదనపు కట్నం కోసం స్వప్నను కొట్టి చంపారని స్థానికులు ఆరోపించారు. స్వప్నను చంపి పురుగుల మందు తాగినట్లు చిత్రీకరించారని ఆరోపించారు.
స్వప్న భర్త, అత్త, మామ, మరిది ఇంటి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు ఇంట్లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. మృతురాలు స్వప్నకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం పరారీలో ఉన్న భర్త, అత్త, మామ, మరిదికి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.