calender_icon.png 14 December, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవంచలో ఉద్రిక్తత.. సర్పంచ్ అభ్యర్థుల మధ్య ఘర్షణ

14-12-2025 09:42:19 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఆదివారం ప్రారంభమై కొనసాగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో(Avancha Village) ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున గ్రామంలోని రెండు వర్గాలు మధ్య ఘర్షణ జరిగింది. సర్పంచ్ అభ్యర్థులు(Sarpanch candidates), సౌమ్య, చంద్రకళ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలకు చెందిన శ్రేణులు కొట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఘర్షణలో ఇద్దరికి గాయాలు కావడంతో జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు.