18-09-2025 04:52:10 PM
హుజూరాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. సేవాపక్షం అభియాన్ కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ఆవరణను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ 2014 అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. స్వయంగా ఆచరించి దేశ ప్రజలు సైతం పాటించేలా కృషిచేశారని అన్నారు. , ప్రజలంతా పరిసర ప్రాంతాలను స్వచ్ఛతగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రభాకర్, తిప్పబత్తిని రాజు, రావుల వేణు, శ్రీనివాస్, గంగిశెట్టి రాజు, వడ్నాల చంద్రిక, రాజశేఖర్, సంజీవరెడ్డి, శశిధర్, సబ్బని రమేష్ కొలిపాక వెంకటేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.