16 March, 2026 | 1:36 PM

తైక్వాండో కరాటే పోటీల్లో రైల్వే కార్మికుల పిల్లల ప్రతిభ

18-09-2025 04:49 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): గద్వాల జిల్లాలో నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఇంటర్ డిస్టిక్ తైక్వాండో ఛాంపియన్స్ పోటీల్లో బెల్లంపల్లికి చెందిన 8 మంది రైల్వే కార్మికులకు పిల్లలు పతకాలు సాధించారు. బెల్లంపల్లి రైల్వే ఇన్స్టిట్యూట్ లో విజేతలకు ఏడిఈఎన్ ఏ .గోపి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ పతకాలు సాధించడంలో కీలక పాత్ర వహించిన కోచ్ ఏ. అజయ్ లు రైల్వే కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు కృష్ణ ప్రసాద్, శ్యామ్, ఆర్ పి ఎఫ్ ఏ ఎస్ ఐ రాథోడ్, రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ ఓ .రమేష్, మంచిర్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి బుచ్చి రామారావు, జిల్లపల్లి వెంకటస్వామి, కమిటీ సభ్యులు జి. రమేష్, సిహెచ్. అనిల్, మజ్దూర్ యూనియన్ నాయకులు, కార్మికులు, తైక్వాండో విద్యార్థులు పాల్గొన్నారు.