వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం
28-02-2026 06:49 PM
మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, భాస్కర్ రెడ్డి
శంకర్‌పల్లి,(విజయక్రాంతి): శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా శనివారం ఏఎంసీ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, ఎర్వగూడ గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి నూతన డైరెక్టర్లను ఘనంగా శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాశెట్టి మోహన్, కౌన్సిలర్లు, డైరెక్టర్లు ఉన్నారు.




