31 July, 2026 | 1:44 AM

దత్త సాయి ఆలయ ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం

31-07-2026 01:09 AM

నిర్మల్ జులై 30 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయి ఆలయ ధర్మకర్తలుగా కొట్టే శేఖర్, ఆనంద్, ఆకుల నర్సయ్య గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ రంగు రవికిషన్ గౌడ్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఆలయానికి ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు నలుగురు ధర్మకర్తలను దేవాదాయ శాఖ నియమించగా, ధర్మకర్త రాథోడ్ పంచపూల, ఎక్స్ అఫీషియో సభ్యుడు రోహిత్ కుమార్ గౌతమ్ ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యారు.

దీంతో కోరం లేకపోవడంతో ఆలయ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. అనంతరం నూతన ధర్మకర్తలను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఈవో భూమయ్య, కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు, సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి, దేవరకోట ఆలయ మాజీ చైర్మన్ లు పొలిశెట్టి సురేందర్, ఆమెడ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.