31 July, 2026 | 2:50 AM

ఎన్నికల నమోదు అధికారులతో సమావేశం

31-07-2026 01:38 AM

హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్

సికింద్రాబాద్,జూలై 30 (విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతిని సమీక్షించడానికి జిల్లాలోని 15 మంది ఎన్నికల నమోదు అధికారులతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. రికార్డుల ప్రామాణికతను నిర్ధారించేందుకు, ఓటరు సంతకం లేని ఏ ’ఎన్యూమరేషన్ ఫారం’ (వివరాల సేకరణ పత్రం)నైనా డిజిటలైజ్ చేయవద్దని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి అధికారులను ఆదేశించారు. సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటరు ఎవరూ జాబితా నుండి తొలగిపోకుండా చూడాలని ఈఆర్వోలను ఆయన నిర్దేశించారు.

అలాగే, 1,100 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిని హేతుబద్ధీకరించాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ఓటర్లకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించబడ్డాయో లేదో సరిచూసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ (ఎన్నికలు) బి. సంతోష్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అరవింద్ కుమార్ ద్వివేది, షంషాబాద్ జోనల్ కమిషనర్ కె. చంద్రకళ మరియు హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వో లు పాల్గొన్నారు.