నెదర్లాండ్స్ చేతిలో స్వీడన్ చిత్తు
22-06-2026 12:43 AM
హూస్టన్, జూన్ 21: సాకర్ ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ తొలి విజయాన్ని అందు కుంది. గ్రూప్ ఎఫ్ మ్యాచ్‌లో డచ్ జట్టు 5 గోల్స్ తేడాతో స్వీడన్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే నెదర్లాండ్స్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. బ్రియాన్ 5వ నిమిషంలోనే గోల్ చేశాడు.
తర్వాత 17వ నిమి షంలో మరో గోల్ కొట్టాడు. సెకండాఫ్‌లో గ్యాక్ఫో ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించాడు. స్వీడన్ తరపున 59వ నిమిషంలో ఆంథోనీ ఏకైక గోల్ చేయగా.. మ్యాచ్ చివరి నిమిషంలో డచ్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ సమ్మర్‌విల్ గోల్ సాధించాడు. దీంతో నెదర్లాండ్స్ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో డచ్ జట్టు రౌండ్ 32కు మరింత చేరువైంది. ప్రస్తుతం 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.






