నాకౌట్ పోరుకు జర్మనీ
ఐవరీకోస్ట్‌పై సంచలన విజయం
టొరంటో, జూన్ 21 : ఫిఫా వరల్డ్‌కప్‌లో జర్మనీ నాకౌట్ స్టేజ్‌కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో జర్మనీ 2 గోల్స్ తేడాతో ఐవరీకోస్ట్‌పై సంచలన విజ యం సాధించింది. ఇరు జట్లు ఆధిక్యం కో సం ఆరంభం నుంచే హోరాహోరీగా తలపడ్డాయి.30వ నిమిషంలో ఐవరీకోస్ట్ కెప్టెన్ గోల్ చేయగా.. 68వ నిమిషంలో జర్మనీ ప్లేయర్ ఉందావ్ చేసిన గోల్‌తో స్కోరు సమమైంది.
ఇక మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకుంటున్న వేళ చివర్లో ఉందావో అద్భు తం చేశాడు. ఇంజ్యూరీ టైమ్ 94వ నిమిషంలో సంచలన గోల్ కొట్టి జర్మనీకి 2 స్కోరుతో విజయాన్నందించాడు. రెండు విజయాలతో జర్మనీ నాకౌట్‌కు క్వాలిఫై అయింది. కాగా జర్మనీ దిగ్గజ గోల్‌కీపర్ మాన్యుయెల్ నూయర్ వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన గోల్‌కీపర్‌గా రికార్డు సృష్టించాడు.






