ఆప్గన్‌ను ఊడ్చేశారు
ఊహించిన ఫలితమే... మూడో వన్డేలో నూ భారత్ దుమ్మురేపింది. బౌలింగ్‌లో ప్రసిద్ధ కృష్ణ నిప్పులు చెలరేగిన వేళ.. బ్యా టింగ్‌లో జైస్వాల్ శతకొట్టిన వేళ ఆప్గనిస్థాన్‌ను టీమిండియా ఊడ్చేసింది. వన్డే సిరీస్ ను 3 క్లీన్‌స్వీప్ చేసింది. కెప్టెన్‌గా వన్డేల్లో గిల్‌కు ఇది తొలి సిరీస్ విజయం.
- వన్డే సిరీస్ భారత్ క్లీన్‌స్వీప్
- చివరి వన్డేలోనూ ఘనవిజయం
- ఐదేసిన ప్రసిద్ధకృష్ణ
- జైస్వాల్ సూపర్ సెంచరీ
చెన్నై, జూన్ 20 : ఆప్గనిస్థాన్‌పై భారత్ జైత్రయాత్ర వన్డే సిరీస్‌లోనూ కొనసాగింది. వరుసగా మూడో వన్డేలోనూ ఘనవిజయం సాధించిన గిల్ సేన సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆప్గనిస్థాన్ ను ప్రసిద్ధ కృష్ణ బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆప్గన్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. కేవలం 34 పరు గులకే 4 వికెట్లు కోల్పోయింది. గుర్బా జ్ (5), జాడ్రాన్ (11), రహమత్ షా (5), రసూలీ (1) పరుగులకు ఔటయ్యా రు. ఈ నాలుగు వికెట్లు ప్రసిద్ధ కృష్ణే పడగొట్టాడు. ఈ దశలో ఆప్గన్ టీమ్‌ను కెప్టెన్ హస్మతుల్లా షాహిది, ఒమర్జాయ్ ఆదుకున్నారు. షాహిది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించారు.
ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసిన ఒమర్జాయ్ ఔటయ్యాడు. తర్వాత నబీతో కలిసి 57 పరుగులు జోడించిన కెప్టెన్ హస్మతుల్లా షాహిది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నబీ(21) కాస్త పర్వాలేదనిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఒకవైపు షాహిది నిలకడగా ఆడుతున్నా మిగిలిన బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలి తంగా ఆప్గనిస్థాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. షాహిది 131 బంతుల్లో 101(13 ఫోర్లు, 1 సిక్సర్ ) ఆఖరి వికెట్ గా వెనుదిరిగాడు.
భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. గుర్రూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష దూ బే ఒక్కో వికెట్ పడగొట్టారు. 219 పరుగుల లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆప్గన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ చెలరేగిపోయారు. రోహిత్ శర్మ పూర్తి ఫామ్ అందుకోగా అటు జైస్వాల్ కూడా అదరగొట్టాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 22.5 ఓవర్లలో 170 పరుగులు జోడించారు.
రోహి త్ శర్మ 69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి జైస్వాల్ భారత్ విజయాన్ని పూర్తి చేశా డు. ఈ క్రమంలో జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా 28.4 ఓవర్లలో నే లక్ష్యాన్ని ఛేదించింది. జైస్వాల్ 86 బంతు ల్లో 110 (14 ఫోర్లు, 3 సిక్సర్లు) , శ్రేయాస్ అయ్యర్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో వన్డే సిరీస్‌ను 3-0తో భారత్ స్వీప్ చేసింది. ప్రసిద్ధ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
స్కోరు బోర్డు
ఆఫ్గనిస్థాన్ ఇన్నింగ్స్ : 218 (హస్మతుల్లా 102, ఒమర్జాయ్ 50, నబీ 21; ప్రసిద్ధ కృష్ణ 5/23, ప్రిన్స్ యాదవ్ 1/38, హర్ష దూబే 1/38)
భారత్ ఇన్నింగ్స్ : 224/1 ( జైస్వాల్ 110 నాటౌట్, రోహిత్ శర్మ 79, శ్రేయాస్ అయ్యర్ 20 నాటౌట్; నబీ 1/47 )
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : ప్రసిద్ధ కృష్ణ
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ : గిల్






