01-06-2025 12:00:00 AM
ఎఫ్‌ఎమ్ రేడియో..
ఇప్పుడంతా డిజిటల్ మయం. కానీ అమ్మమ్మ, నానమ్మకాలంలో బ్లాక్ అండ్ టీవీలు.. రేడియోలదే హావా ఉండేది. అయితే అప్పుడప్పుడూ ఎక్కడో.. ఓ చోట ఎఫ్‌ఎమ్ రేడియోలు, పాతకాలం నాటి టీవీలు దర్శనమిస్తాయి. నిజానికి వాటిని చూసినప్పుడు కలిగే ఆనందమే భిన్నంగా ఉంటుంది.
ఇప్పుడు అలెక్సా ఈ పాట కావాలి అంటే అది ఆ పాటనే ప్లే చేస్తుంది. ఎఫ్‌ఎమ్ రేడియోల మాత్రం అలా కాదు.. ఒక్కో స్టేషన్‌లో ఒక్కో న్యూస్ వచ్చేవి. ఎవరికి ఇష్టమైన స్టేషన్‌ను వారు ప్లే చేసుకొని ఆనందించేవారు. ఇప్పటికీ ఎఫ్‌ఎమ్ రేడియోలో సంప్రదాయ సంగీతాన్ని ఆస్వాదించేవారు ఉన్నరంటే అర్థం చేసుకోవచ్చు వాటి ప్రాముఖ్యతను.
వెదురు అల్లికలు
వెదురుతో తయారు చేసిన ప్రతిదీ చాలా ప్రత్యేకంగా, సహజంగా కనిపిస్తాయి. అది చిన్న అల్లికైన సరే. ప్లాస్టిక్‌తో పోల్చితే వెదురుతో త యారు చేసిన బుట్టలు, గుల్లలు, చాట లు.. ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచి వి. ప్లాస్టిక్ వస్తువులు రావడంతో వెదు రు అల్లికలపై ఆదరణ తగ్గింది. కానీ ప్లాస్టి క్ వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి కలి గే నష్టాన్ని గుర్తించి..
చాలామంది వెదురువైపు మక్కువ చూపుతున్నారు. ఇప్పటికి అక్కడక్కడ దర్శనమిచ్చే వెదురు బుట్టలు.. చిన్నచిన్న అల్లికలు మనసును హత్తుకుపోతాయి. ప్లాస్టిక్‌ను దూరం పెట్టి పర్యావరణహితమైన వెదురు వ స్తువులతో తయారు చేసిన వస్తువులు వాడటం ఉత్తమం. ఇది కుటుంబ ఆరోగ్యానికీ శ్రేయస్కరం.