calender_icon.png 6 June, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో నేడు

01-06-2025 12:00:00 AM

ప్రపంచ పాల దినోత్సవం

ప్రతి ఏడాది జూన్ ౧న ప్రపంచ పాల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. పాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ పాల దినోత్సవం జరుపుకొంటారు. పాలల్లో కల్తీ జరగకుండా ప్రభుత్వమే నిరంతర పర్యవేక్షణ చేయాలనేది ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చిన్న, పెద్ద డెయిరీలు, సహకార సంఘాలు, నష్టాల బారిన పడకుండా వారికి సహకరించాలి. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం అగ్రభాగాన ఉన్నా.. వినియోగంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డాం. ఈ నష్టాన్ని గుర్తించి 2001 జూన్ 1 నుంచి ఫుడ్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా మార్చారు. 

చిన్నారుల సంక్షేమంపై..

ప్రతి ఏడాది జూన్ 1న అంతర్జాతీయ బాలల దినోత్సవం జరుపుకొంటారు. 1925 లో అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని మొ దటిసారి జెనీవాలో పిల్లల సంక్షేమంపై జరిగిన ప్రపంచ సమావేశంలో ప్రకటించారు. ఈ దినాన్ని పిల్లల హక్కుల గురించి అవగాహన కల్పించడానికి, వారి సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు జరుపుకునే ఒక అంతర్జాతీయ పండుగ. ఈరోజు చిన్నారులకు సంబంధించిన విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సీఎన్‌ఎస్ పరిచయం

1980, జూన్ 1న ప్రపంచంలోని మొట్టమొదటి సారి 24 గంటల టెలివిజన్ వార్తా నెట్‌వర్క్ అయిన సీఎన్‌ఎస్ (కేబుల్ న్యూస్ నెట్‌వర్క్) అరంగేట్రం చేసింది. ఈనెట్‌వర్క్ జార్జియాలోని అట్లాంటాలోని దాని ప్రధాన కార్యాలయం నుంచి పౌర హక్కుల నాయకుడు వెర్నాన్ జోర్డాన్ హత్యాయత్నం గురించి ప్రధాన కథనంతో ప్రత్యేక్షమైంది. 

గ్లోబల్ పేరెంట్స్ డే

ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకొంటారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ 2012లో తల్లిదండ్రుల పట్ల పిల్లలు బాధ్యతగా వ్యవహరించాలని, వారి త్యాగాన్ని గౌరవించాలని.. ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు.