calender_icon.png 2 June, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ అధికారిగా వెంకట రమణ

31-05-2025 09:57:28 PM

ఉత్తమ కార్మికునిగా సునీల్

మందమర్రి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏరియాలో విధులు నిర్వహిస్తున్న వై.వెంకటరమణ (అడిషనల్ జనరల్ మేనేజర్ ఈ అండ్ ఎం), జిఎం ఆఫీస్ ఉత్తమ అధికారిగా, అలాగే ఉత్తమ ఉద్యోగిగా టి.సునీల్ కుమార్ (కోల్ కట్టర్) కేకే-5, ఎంపిక చేస్తూ సింగరేణి యాజమాన్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపికైన ఉత్తమ అధికారి వెంకట రమణను కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జూన్ రెండున నిర్వహించనున్న సెంట్రల్ ఫంక్షన్ లో సింగరేణి సిఎండి బలరాం(Singareni CMD Balaram) చేతుల మీదుగా సన్మానం తో పాటు ప్రశంసాపత్రం అంద చేయనున్నారు.అదేవిధంగా ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన టి.సునీల్ కుమార్ (కోల్ కట్టర్, కేకే-5)ను పట్టణంలోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఏరియా జిఎం జి.దేవేందర్ చేతుల మీదుగా సన్మానం, ప్రశంసా పత్రం అందించనున్నట్లు యజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. కాగా ఉత్తమ అధికారిగా, ఉద్యోగిగా ఎంపికైన వారిని ఏరియా అధికారులు, కార్మికులు అభినందించారు.