15 July, 2026 | 1:12 AM

స్విగ్గీ ఐపీవో సీక్రెట్ ఫైలింగ్!

27-04-2024 12:05 AM

రూ.10,000 కోట్ల ఆఫర్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీకి ముసాయిదా దరఖాస్తు పత్రాల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి గోప్యంగా సమర్పించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 1.25 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఆఫర్ జారీచేసేందుకు ఇటీవలే షేర్‌హోల్డర్ల అనుమతి పొందిన స్విగ్గీ సెబీ అనుమతించే రహస్య మార్గంలో ఐపీవో ముసాయిదా పత్రాల్ని దాఖలు చేసిందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ మార్గంలో ఆఫర్ జారీచేయదల్చిన కంపెనీ బహిరంగంగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను విడుదల చేయదు. ఐపీవోలో 800 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ప్రస్తుత షేర్‌హోల్డర్లు  ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయిస్తారు. మరో 450 మిలియన్ డాలర్ల తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారిచేస్తుందని సమాచారం.