15 July, 2026 | 1:01 AM

స్వల్పంగా పెరిగిన ఎస్బీఐ లైఫ్ లాభం

27-04-2024 12:10 AM

ముంబై, ఏప్రిల్ 26: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నికరలాభం క్యూ4లో స్వల్పంగా 4 శాతం వృద్ధిచెంది రూ.810 కోట్లకు చేరింది.  కంపెనీ నికర ప్రీమియం ఆదాయం రూ. 19,896 కోట్ల నుంచి రూ.25,116 కోట్లకు చేరింది. సంస్థ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.3.07 లక్షల కోట్ల నుంచి రూ.3.88 లక్షల కోట్లకు పెరిగింది. ఎస్బీఐ లైఫ్ షేరుకు రూ.2.7 చొప్పున డివిడెండును ప్రకటించింది.