బజాజ్ ఫిన్‌సర్వ్ నికరలాభం రూ.2,119 కోట్లు
27-04-2024 12:05 AM
ముంబై, ఏప్రిల్ 26: ఎన్‌బీఎఫ్‌సీ బజాన్ ఫిన్‌సర్వ్ నికరలాభం మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 20 శాతం పెరిగి రూ.2,119 కోట్లకు చేరింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 35.6 శాతం వృద్ధితో రూ.32,042 కోట్ల వద్ద నిలిచింది. శుక్రవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.1 చొప్పున డివిడెండు సిఫార్సుచేసింది.
బజాజ్ ఫైనాన్స్
బజాజ్ ఫైనాన్స్ కన్సాలిడేటెడ్ నికరలాభం క్యూ4లో 21 శాతం వృద్ధిచెంది రూ.3,825 కోట్లకు చేరిం ది. నికర వడ్డీ ఆదాయం రూ.6,254 కోట్ల నుంచి రూ.8,013 కోట్లకు పెరిగింది. 0.85 శాతం స్థూల ఎన్‌పీఏల ను, 0.37 శాతం నికర ఎన్‌పీఏలను ప్రకటించింది. కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తులు 34 శాతం వృద్ధితో రూ.3.31 లక్షల కోట్లకు పెరిగాయి.






